క్రీడాభూమి

విశ్రాంతి లేకుంటే కష్టమన్న విరాట్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: తాను రోబోను కానని, తనకూ విశ్రాంతి అవసరమని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ అతను 7 టెస్టులు, 26 వనే్డలు, మరో 10 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నందువల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతామని అన్నాడు. కొన్ని మ్యాచ్‌లు లేదా సిరీస్‌ల నుంచి విశ్రాంతి కోరుతున్నారా? అని బుధవారం జరిగిన సమావేశంలో ఓ విలేఖరి ప్రశ్నించగా, కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. అలసట లేకుండా మ్యాచ్‌ల మీద మ్యాచ్‌లు ఆడడానికి తానేమీ రోబోను కానని అన్నాడు. ‘నా చర్మాని చెక్కేసి, రక్తం వస్తున్నదో లేదో పరీక్షించుకోండి’ అన్నాడు. నిరంతరం ఒకే స్థాయిలో, ఒకే విధంగా రాణించడం ఎవరికైనా అసాధ్యమేనని స్పష్టం చేశాడు.
అవగాహనతోనే మాట్లాడాలి: క్రికెటర్లకు విశ్రాంతిపై ఎవరికివారే తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. అవగాహనతో మాట్లాడాలని హితవు పలికాడు. ఎన్ని మ్యాచ్‌లు ఆడారు అన్నది కాకుండా ఎంత సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని బ్యాటింగ్ చేశారు లేదా ఎన్ని ఓవర్లు బౌల్ చేశారు అనే కోణంలోనే పని భారాన్ని లెక్కించాల్సి ఉంటుందన్నాడు. వర్క్‌లోడ్ అనేది జట్టులోని మొత్తం 11 మంది ఒకే విధంగా ఉండదని స్పష్టం చేశాడు. ఒక టెస్టులో అందరూ సుమారు 45 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేస్తారని, 30 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు బౌల్ చేసి ఉంటారనిగానీ అనుకోరాదన్నాడు. కొంత మంది ఎక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తక్కువ సేపు క్రీజ్‌లో ఉండడమో లేదా తక్కువ ఓవర్లు బౌల్ చేసి ఉండడమో జరిగి ఉంటుందన్నాడు. మరికొంత మంది తక్కువ మ్యాచ్‌లు ఆడినా, ఎక్కువ సేపు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశాలు లేకపోలేదని అన్నాడు. చటేశ్వర్ పుజారా బ్యాటింగ్‌ను కోహ్లీ ఉదాహరణగా తీసుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయి, వికెట్లు కూలకుండా అడ్డుకోవడం అతని అలవాటని చెప్పాడు. కాబట్టి పుజారా ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉంటాడని, అతని కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారు కూడా తక్కువ సేపు బ్యాటింగ్ ఉండవచ్చని వివరించాడు. వర్క్‌లోడ్‌పై స్పష్టమై అవగాహన ఉన్నప్పుడే, ఎవరికి విశ్రాంతి అవసరం, ఎవరికి అనవసరం అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుందన్నాడు. టాప్‌క్లాస్‌లో ఆడేవారిలో సుమారు 20 నుంచి 25 మందికి తగినంత విశ్రాంతి అవసరమని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. లేకపోతే, కీలక సమయాల్లో వారు విఫలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.