జాతీయ వార్తలు

అమరావతిపై నేడు కీలక తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కీలక తీర్పు వెలువడనుంది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రంనుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని, రాజధాని ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నాలుగు పిటిషన్లు ఎన్జీటీలో దాఖలయ్యాయి. 2015లో శ్రీమన్నారాయణ, కమలాకర్ ఎన్జీటీలో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం మాజీ ఐఏఎస్ అధికారి శర్మ, బోలిశెట్టి సత్యనారాయణ కూడా మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు న్యాయవాదులు సంజయ్ పారీక్, శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, గూంటూరు ప్రభాకర్, ప్రమోద్ కుమార్ వాదనలు వినిపించారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో నూతన రాజధాని నిర్మాణం వల్ల ముంపునకు గురికావడంతో పాటు, పర్యావరణానికి తీవ్రముప్పు వాటిల్లుతోందంటూ పిటిషనర్లు ఎన్జీటీకి వివరించారు. దీనిపై ప్రభుత్వం, సీఆర్డీయే కూడా నూతన రాజధాని నిర్మాణంలో, కృష్ణానదీ తీరాన ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఎన్జీటీకి విఫులీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత ఏప్రిల్ నెలలో తీర్పును రిజర్వుచేసింది. అయితే తీర్పు ప్రభుత్వనికి అనుకూలంగా ఉంటుందా లేక ఏవైనా సలహాలు, సూచనలను ఇస్తుందా లేక పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.