జాతీయ వార్తలు

గవర్నర్లకు నోటీసులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాజకీయ అనిశ్చితిలో చిక్కుకున్న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడానికి సంబంధించిన కేసుల్లో ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాకు నోటీసు ఇవ్వడం తప్పేనని సుప్రీం కోర్టు అంగీకరించింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో గవర్నర్లకు పూర్తి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇంతకు ముందు తాము జారీ చేసిన తీర్పును,అలాగే గవర్నర్లకు ఉండే మినహాయింపులను ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. అనంతరం రాజ్‌ఖోవాకు జారీ చేసిన నోటీసును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ‘గవర్నర్‌కు నోటీసులు జారీ చేయడం తప్పే’నని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కోర్టులో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. దీనిపై మాట్లాడిన అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ రాజ్యాంగ పరంగా గవర్నర్లకు ఉండే ప్రత్యేక మినహాయింపులను విపులంగా తెలిపారు. న్యాయ ప్రక్రియల్లో పాల్గొనాలని గవర్నర్లను కోరడానికి వీల్లేదంటూ 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అటార్నీ జనరల్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 361 అధికరణ కింద గవర్నర్లకు పూర్తి మినహాయింపు ఉంటుందన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని జస్టీస్ జెఎస్ ఖేహర్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘అందుకే ప్రతివాది-2 (గవర్నర్)కు జారీ చేసిన నోటీసును వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించింది. అయితే ఈ నోటీసు ఉపసంహరణ అన్నది అరుణాచల్ గవర్నర్ కోర్టుకు తన వాదన తెలియజేయడానికి ద్వారాలు మూసివేసినట్టు కాదని తెలిపింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించడానికి దారితీసిన పరిస్థితుల్ని వివరిస్తూ నివేదికను దాఖలు చేస్తామని గవర్నర్ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సత్పాల్ జైన్ వెల్లడించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. కాగా, రాష్టప్రతి పాలనకు వ్యతిరేకంగా అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నబం టుకి, కాంగ్రెస్ నాయకుడు బమాంగ్ ఫెలిక్స్ తాజాగా దాఖలు చేసిన కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.