క్రీడాభూమి

ఆ ఫోన్ కాల్స్ డేటా లేకుంటే అతను తప్పించుకునేవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 11: ఇప్పటికే తనపై శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం, హత్యాయత్నానికి పాల్పడడం వంటి చర్యలపై భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అతని భార్య హసీన్ జహాన్ ఆదివారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయనడానికి, అతను వారితో సంభాషించిన అంశాలు అతని నుంచి సేకరించిన కాల్ డేటా తనకు మంచి ఆయుధంగా నిలిచిందని ఆమె పేర్కొంది. ఈ ఆధారం లేకుంటే అతను ఎప్పుడో తనను విడాకులు ఇచ్చేసి ఉత్తర ప్రదేశ్ నుండి పారిపోయేవాడని ఆమె ఆరోపించింది. షమీ తనకు ఆహారంలో విషం కలిపి హత్యాయత్నానికి పాల్పడడం, భౌతిక దాడులకు పాలడడం, అతని కుటుంబ సభ్యులు సైతం వేధించడం వంటి అంశాలపై ఆమె ఇక్కడి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు మహ్మద్ షమీపై ఏడు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. ‘తన తప్పులు తెలుసుకోవాలని చాలా కాలం నుండి నేను ఎన్నోసార్లు అతనిని అభ్యర్థించాను’ అని ఆమె పేర్కొంది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడని, కానీ వద్ద ఉన్న మొబైల్ డేటా ఆధారాలు ఉన్నాయని, ఇవే తనకు న్యాయం చేస్తాయని ఆశిస్తున్నానని ఆమె పేర్కొంది.

క్రీడా సమస్యల పరిష్కారానికి
సమన్వయ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ, మార్చి 11: జాతీయ స్థాయిలో క్రీడాపరంగా ఉత్పన్నమయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తొమ్మిది మంది సభ్యులు కలిగిన కమిటీ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)ల పర్యవేక్షణలో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రముఖ న్యాయవాది ఆర్‌కే ఆనంద్ వర్కింగ్ చైర్మన్‌గా, భారత ఒలింపిక్ సంఘం సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా కన్వీనర్‌గా ఉంటారు. ఆనందేశ్వర్ పాండే, అనిల్ ఖన్నా, సుందన్ష్ మిట్టల్, రణ్‌ధీర్ సింగ్ లలిత్ భానోత్, తర్లోచన్ సింగ్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పటిష్టతకు అవసరమైతే మరికొందరిని ఎంపిక చేసుకునే హక్కు చైర్మన్‌కు ఉంది.