క్రీడాభూమి

యువ షూటర్లకు అవకాశాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: మెక్సికోలో ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లో మన దేశానికి నాలుగు బంగారు పతకాలతో సహా తొమ్మిది పతకాలను అందించిన యువ షూటర్లు మరింతగా మెరిసేందుకు మరిన్ని అవకాశాలు వేచిచూస్తున్నాయి. షూటింగ్‌లో భారత క్రీడా పతకాన్ని ఎగురవేయడానికి మంచి నైపుణ్యం, ఆసక్తి, తెలివితేటలు, విశ్వాసం ఉన్న యువత త్వరలో జరుగనున్న కామనె్వల్త్ గేమ్స్‌లో మరోసారి తమ సత్తా చాటేందుకు చక్కని వేదిక కానుంది. వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రిస్‌బేన్‌లోని బెల్‌మోంట్ షూటింగ్ కాంప్లెక్స్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్న కామనె్వల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు పెద్దఎత్తున పాల్గొననున్నారు. ఇప్పటికే మను బాకర్, మెహులీ ఘోష్, అనీష్ భన్వాలా, అంజుమ్ వౌడ్గిల్ వంటి షూటర్లు ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో తమ సత్తా ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సందర్భంగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రెసిడెంట్ మాట్లాడుతూ భారత షూటర్లకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నాడు. ‘మన యువత తన నమ్మకాన్ని నిలబెడుతుందనే విశ్వసిస్తున్నా..మంచి ఫలితాలు వారి నుంచి ఆశించొచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది జరిగిన వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో బాగా మెరిశారని, ఇది యువతకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నాడు. 2016 రియో ఒలింపిక్స్ మొదలుకుని ఇటీవల మెక్సికో వరల్డ్ కప్‌లో జరిగిన వివిధ పోటీల్లో భారత షూటర్లు విజయాలను అందుకుంటున్నారంటే ఈ ఘనత అంతా ఎన్‌ఆర్‌ఐఏ ప్రెసిడెంట్‌కే దక్కుతుంది. ఇంతవరకు ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా ఒక్కడే బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల భారత్‌కు తొమ్మిది పతకాలు అందించిన పలువురు షూటర్లను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్‌కే దక్కుతుందని అభినవ్ బింద్రా అన్నాడు. ప్రస్తుతం షూటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువత ప్రపంచ కప్‌లోనే త్వరలో జరుగనున్న కామనె్వల్త్ గేమ్స్, ఆ తర్వాత నిర్వహించే వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్‌లో మరిన్ని పతకాలను అందించేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శించేందుకు ఇప్పటినుంచే అన్నివిధాల సంసిద్ధులు కావాలని ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ సూచించాడు.
ఇదిలావుండగా, ఇంటర్నేషనల్ షూటింగ్‌లో పాల్గొన్న ప్రథమార్ధంలోనే తన అపార తెలివితేటలతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన 16 ఏళ్ల మను బాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే వివిధ పోటీల్లో మరిన్ని పతకాలను అందించేందుకు శక్తియుక్తులను ప్రదర్శిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మను బాకర్ తిరువనంతపురంలో జరిగిన 61వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తొమ్మిది బంగారు పతకాలతో సహా 15 పతకాలను గెలుపొందిన విషయం తెలిసిందే. అదేవిధంగా కోల్‌కతాలోని కర్మాకర్ అకాడమీకి చెందిన మెహులి 2016లో జరిగిన జాతీయ పోటీల్లో రెండు పతకాలు, 2017లో ఎనిమిది పతకాలు, ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఆసియన్ ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్ యూత్ కేటగిరిలో బంగారు పతకాన్ని సాధించింది. రానున్న కామనె్వల్త్ గేమ్స్‌ను లక్ష్యంగా చేసుకుని మెహులీ ఘోష్, అనీష్ భన్వాలా, అంజుమ్ మోడ్గిల్ వంటివారు సిద్ధమవుతున్నారు.