జాతీయ వార్తలు

మోదీ వ్యూహానికి సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్ దాడిపై కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్, జనవరి 2: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహానికి మొట్టమొదటి సవాలుగా జమ్మూ-కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. తీవ్రవాదం, చర్చలు కలసికట్టుగా ముందుకు సాగలేవన్న వైఖరిని విడనాడి భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియకు బిజెపి అండగా నిలవాలని శనివారం ఆయన ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. ‘గత అనుభవాలను పరిశీలించి చూస్తే.. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు నిర్ధేశిత లక్ష్యంతో కేవలం కొద్ది గంటల ముందే దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఈ విషయం త్వరలోనే రుజువు అవుతుంది. పాక్ విషయంలో మోదీ అనుసరిస్తున్న వ్యూహానికి ఈ దాడి మొట్టమొదటి పెద్ద సవాలు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదం, చర్చలు కలసికట్టుగా ముందుకు సాగలేవన్న వైఖరిని బిజెపి విడనాడి, భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియకు అండగా నిలవాలి’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
శాంతి ప్రక్రియను భగ్నం చేసేందుకే
చండీగఢ్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పంజాబ్ పిసిసి అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. శాంతి ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు పాకిస్తాన్‌లోని దుష్టశక్తులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోందని, వారి కుయుక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగనివ్వరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లాహోర్‌ను సందర్శించిన కొద్ది రోజులకే ఈ ఉగ్రవాద దాడి జరిగిన విషయాన్ని అమరీందర్ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, గతంలో అప్పటి ప్రధాని అతల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్‌కు బస్సు యాత్ర జరిపిన తర్వాత చోటుచేసుకున్న ఘటనలు ప్రస్తుతం పునరావృతం కాకూడదని ఆకాంక్షించారు. లాహోర్‌లో వాజ్‌పేయి యాత్ర ముగిసిన కొద్దికాలానికే కార్గిల్ యుద్ధం జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమరీందర్ ఈ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘ఇరు దేశాల (్భరత్, పాకిస్తాన్) మధ్య శాంతి ప్రక్రియను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌లోని దుష్టశక్తులే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇటువంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు’ అని అమరీందర్ శనివారం చండీగఢ్‌లో అన్నారు.
ఉగ్రమూకల ఉచ్చులో పడొద్దు: సిపిఐ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శనివారం తీవ్రంగా గర్హించింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాద సంస్థలు పన్నుతున్న ఉచ్చులో చిక్కుకోరాదని ఇరు దేశాలకు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన కొద్దిరోజులకే ఈ దాడి జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను, ఇతర చొరవలను భగ్నం చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఇటువంటి కవ్వింపు చర్యలతో ఉగ్రవాద సంస్థలు పన్నుతున్న ఉచ్చులో చిక్కుకోరాదని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా చర్చల ప్రక్రియను భగ్నం చేయలేరని ఉగ్రవాదులకు బలమైన సందేశాన్ని పంపాల్సిందిగా కోరుతున్నాం’ అని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తెలిపారు.