సబ్ ఫీచర్

రవితేజలోని ఫైర్ నచ్చింది -- దర్శకుడు కళ్యాణ్ కృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా నెల టిక్కెట్టు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో దర్శకుడిగా అడగుపెట్టిన ఆయన తన రెండో ప్రయత్నంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం..’తో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా రవితేజతో ‘నెల టిక్కెట్టు’ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 25 విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
అందుకే ఈ టైటిల్..
ఇందులో పెద్ద పెద్ద ఫైట్స్ కోసం ఆ టైటిల్ పెట్టలేదు. ఎక్కువగా సినిమాలో మాస్ జనం కనిపిస్తారు. హీరో వాళ్లతోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైటిల్ పెట్టాను. మాస్ సినిమా అంటే క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. బాల్కనీ వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చుతుంది.
ఆవారా పాత్రలో...
ఇందులో హీరో ఆవారా. లైఫ్ జర్నీలో అతను ఎంతమందిని తనతో కలుపుకుని ఒక ఫ్యామిలీని తయారుచేసుకున్నాడు అనేది అతని పాత్ర. రవితేజ తనదైన మార్క్‌తో ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా రోజులుగా రవితేజగారితో ట్రావెల్ చేశాను. ఆయనతో వర్క్ నిజంగా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆయనలో కమిట్మెంట్ నాకు చాలా ఇష్టం. నా సినిమా షూటింగ్ చివరిరోజు చివరి షాట్ అవగానే వెంటనే వేరే లోకేషన్‌కు వెళ్లి మైత్రి మూవీస్ వాళ్ల కొత్త సినిమాను మొదలుపెట్టారు.

ఆ కమిట్మెంట్ అందరికీ ఉండదు. ఆయన్నుండి అదే నేర్చుకున్నాను.
గొప్ప నిర్మాత..
నిర్మాత రామ్‌గారికి చాలా వ్యాపారాలున్నాయి. ఆయనకు మేనేజ్మెంట్ స్కిల్క్ చాలా ఎక్కువ. ఏది కావాలని అడిగినా నిమిషాల్లో ఏర్పాటు చేసేవారు.
స్టార్ హీరోలతో..
మొదటి సినిమానే నాగార్జునగారితో చేయడం నా అదృష్టమనే చెప్పాలి. ఆ తర్వాత రెండవ సినిమా అన్నపూర్ణ బ్యానర్‌లో చేయడం, మూడో సినిమా రవితేజ గారితో చేయడం నా అదృష్టం.
హైలెట్స్..
హీరోయిన్‌ది కథలో చాలా ముఖ్యమైన పాత్ర. కేవలం హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉండదు. అలాగే శక్తికాంత్ చాలా మంచి సంగీతం అందించాడు. ఇప్పుడు కూడా మిక్స్‌ంగ్‌లో కూర్చుని ఇంకా బెటర్ ఔట్‌పుట్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. అతను ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడు. ఒకదాని తర్వాత ఇంకొకటి చేస్తుంటారు.

--శ్రీ