జాతీయ వార్తలు

ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడికి సుష్మా అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని సామాజిక మాధ్యమాల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అండగా నిలుస్తారు. ఆమె ఈ విషయంలో ఎంతో ప్రజాదరణ సైతం పొందారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉంటున్న అలీ అనే వ్యక్తి సంవత్సరం నుంచి తాను తిరిగి భారత్ వెళ్లిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చివరకు విసిగి వేసారిన ఆయన తనకు ఇక ఆత్మహత్య చేసుకోవటం మినహా మరో మార్గం లేదని ట్వీట్ చేయటంతో సుష్పా స్పందించి ఆత్మహత్య ఆలోచన చేయవద్దని, నేనున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు వివరాలు పంపాలని ఆమె రియాద్‌లోని భారత్ దౌత్యకార్యాలయాన్ని ఆదేశించారు. అలాగే అమెరికాలోని క్షితిజ్ అనే వ్యక్తి శ్రాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సోలెంట్ కార్యాలయ అధికారులు రుసుములను కార్డుల ద్వారా తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి సుష్మా ధన్యవాదాలు చెబుతూ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.