జాతీయ వార్తలు

రాహల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణగా సుప్రీంకోర్టు రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసింది.