జాతీయ వార్తలు

ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ రాంపూర్ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ అభ్యర్థి ఆజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించారు. ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘సమాజ్‌వాద్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీకు దగ్గర్లోనే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. కౌరవ కురు వృద్ధుడు భీష్ముడి వలే ఉండకండి’’ అని అన్నారు. అంతేకాదు జయప్రదపై ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.