జాతీయ వార్తలు

టెక్నాలజీతోనే మెరుగైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుసంధానమైన పాఠశాలలకు ప్రధా ని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని.. విద్యా నాణ్యతనూ పెంచుకోవాలని కోరారు.
విద్యా భారతి అఖిల భారతి శిక్షా సంస్థాన్ ప్రధానోపాధ్యాయుల సదస్సునుద్దేశించి మోదీ మాట్లాడారు. టెక్నాలజీకి దూరం కావడం వల్ల విద్యారంగంతో పాటు ఆన్ని రంగా లూ వెనుకబడిపోయే అవకాశం ఉందని అన్నారు. శిక్షా సంస్థాన్ ఆధ్యర్యంలో నడుస్తున్న పాఠశాలల సం ఖ్య గణనీయంగా పెరిగిందని.. దీని దృష్ట్యా మిగతా పాఠశాలలతో పోటీ పడే విధంగా అన్నింటా విద్యార్థులను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం 32 లక్షల మంది విద్యార్థులతో 12వేల పాఠశాలలను ఈ సంస్థాన్ నిర్వహిస్తోందన్నారు. అన్ని విధాలుగా విద్యార్థులను వర్తమాన సవాళ్లను ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దక పోతే ఉపయోగం ఉండదని..నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ సంస్థ సంస్కృతి, సంప్రదాయం, విద్యా బోధన అన్నది ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా ఉండాలన్నారు. విలువలతో కూడిన విద్యను అందిం చే సంస్థగా విద్యాభారతి ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. అంతే కాదు 2020 ఒలిపిక్స్‌లో బంగారు పతకాలను గెలుచుకునే విధంగా క్రీడాకారులనూ ఈ సంస్థ తీర్చిదిద్దాలన్నారు.