జాతీయ వార్తలు

టీచర్ల భర్తీపై ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ఏటువంటి చర్యలు తీసుకోన్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదేశించింది. తెలుగు రాష్ట్రాలలోని పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణంపై న్యాయవాది జికె రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు ఏం చర్యలు తీసుకున్నారని జస్టిస్ దీపక్ మిశ్రా ఇరు రాష్ట్రాలను ప్రశ్నించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ప్రభాకర్ స్పందిస్తూ ఏపీలో 10 వేలమంది ఉపాధ్యాయుల నియామకాలకు చర్యలు తీసుకుందని, వీలైనంత త్వరగా నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి వాదనాలు వినిపిస్తూ రాష్ట్రంలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీంతో ఏం చర్యలు తీసుకోన్నారో తెలియజేస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదేశించింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్ దాఖలు చేసింది.