జాతీయ వార్తలు

తప్పనిసరి ఓటింగ్ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో తప్పనిసరి ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సంస్కరణలను మాత్రం ముందుకు తీసుకువెళతామని ప్రస్తుతం వీటి అవసరం ఎంతైనా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ లోక్‌సభలో వెల్లడించారు. నిర్బంధ ఓటంగ్‌ను ప్రవేశపెట్టే అంశంపై ఓ అనధికార బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఎన్నికల సంస్కరణలను తీసుకొచ్చే క్రమంలో నేటి చర్చలో సభ్యులు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కూడా వెల్లడించారు. చర్చ అనంతరం ఈ అనధికార బిల్లును బిజెపి సభ్యుడు జనార్దన్‌సింగ్ సింగ్రేవాల్ వెనక్కి తీసుకున్నారు. తప్పనిసరి ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న యోచన ప్రశంసనీయమే అయినప్పటికీ ఇది ఎంతమాత్రం సాధ్యం కాదని, ఓటు హక్కు వినియోగించుకోని వారిపై చర్యలు తీసుకోవడం అసాధ్యమని వెల్లడించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోని 25కోట్ల మందిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మొత్తం న్యాయవ్యవస్థే కుప్పకూలి పోతుందని సదానందగౌడ అన్నారు. అయితే ప్రజల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న స్పృహను కలిగించే విధంగా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటూనే ఉందని ఆయన వెల్లడించారు. నిర్బం ధ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రతి ఒక్కరి హక్కు దెబ్బతింటుందని, ఓటు హక్కు అన్నది బలవంతంగా వినియోగించుకునేలా చేసే ది కాదని మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్య విధానాలకు, నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళలేమన్నారు. లా కమిషన్ నివేదిక సహా ఇప్పటివరకు వచ్చిన ఏ నివేదిక కూడా నిర్బంధ ఓటింగ్‌కు అనుకూలమైన సిఫార్సులు చేయలేదని గుర్తుచేశారు. భారత్ వంటి దేశంలో ఇది సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని ఈ నివేదికలు వ్యక్తం చేశాయన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సింగ్రేవాల్ మాట్లాడుతూ నిర్బంధ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యం మరింత శక్తివంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్చలో బిజెపి సభ్యుడు దేవేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.