క్రీడాభూమి

టి-20 ప్రపంచ కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం శ్రీలంక జట్టుకు సారథ్యం వహిస్తున్న స్ట్రైక్ బౌలర్ లసిత్ మలింగ వచ్చే నెల భారత్‌లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టి-20 టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న మలింగ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో మ్యాచ్ ముగిసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఇంతకుముందు ప్రపంచ కప్ ఎడిషన్ ముగిసిన తర్వాత మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వంటి శ్రీలంక స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. అయితే ప్రస్తుత ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ ముగిసిన తర్వాత మీరు కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకుంటున్నారా? అని విలేఖర్లు ప్రశ్నించగా, ‘కావచ్చు’ అని మలింగ సమాధానమిచ్చాడు. మోకాలి గాయంతో ప్రస్తుతం తాను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నానని, దీని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం రెండేళ్లయినా పడుతుందని మలింగ చెప్పాడు. దీనిని బట్టి చూస్తే మలింగ తన 33వ ఏటనే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికే రోజు ఇంకెంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది.