హైదరాబాద్

తపంచా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇద్దరి అరెస్టు
హైదరాబాద్, మార్చి 12: తపంచా విక్రయించాడానికి ప్రయత్నించిన ముగ్గురిలో ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన ఎన్.శ్రీనివాస్(34), ఛత్రినాక రాజన్నబావి ప్రాంతానికి చెందిన కె.రవికిరణ్‌గౌడ్(29)లు కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే నెపంతో తపంచా, బుల్లెట్‌లను తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించాలని పూనుకున్నారు. గార్డెన్ పనిచేసే శ్రీనివాస్‌కు బీహర్‌లో నివాసం ఉండే రాకేష్(38)తో స్నేహం ఏర్పడింది. దీంతో శ్రీనివాస్ ఐదువేల రూపాయలకు తపంచా, రెండు లైవ్‌బుల్లెట్‌లను కొనుగోలు చేశారు. పిస్టల్‌తో పాటు లైవ్‌రౌండ్స్‌ను గుర్తు తెలియని వ్యక్తికి అమ్మేందుకు ఫలక్‌నూమలోని కోహినూర్ బార్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్సు, స్థానిక ఛత్రినాక పోలీసులు సంయుక్తంగా వలపన్ని నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకుని తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ఫోర్సు పోలీసులు ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. బీహర్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాకేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.