జాతీయ వార్తలు

ఆలయం వద్ద నాపై హత్యాయత్నం: తృప్తి దేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం తనపై హత్యాయత్నం జరిగిందని ఆలయాల్లో మహిళల ప్రవేశానికి పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. కొంతమంది ఆందోళనకారులతో మహాలక్ష్మి ఆలయం వద్దకు తాను వెళ్లగా కొందరు తనపై దాడి చేసి గాయపరిచారని ఆమె చెప్పారు. మహిళలపై కొందరు ఆగంతకులు దాడి చేసి దుస్తులు చించివేశారన్నారు. గాయాలపాలు కావడంతో ప్రస్తుతం తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ఆమె గురువారం మీడియాకు చెప్పారు. షిరిడీ సమీపంలోని శని ఆలయంలోకి మహిళలను అనుమతించాలని ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చినందున మిగతా ఆలయాల్లోనూ స్ర్తిలను అడ్డుకోరాదన్నారు.