హైదరాబాద్

వౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పించడంలో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయం నుండి వౌలిక సదుపాయాల కల్పనపై మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్తు, మంచినీటి సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రజలకు మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు, ఇతర వౌలిక సదుపాయాలు కల్పిస్తున్న అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న రోజు రాష్ట్రంలో 34 శాతం పన్నులు వసూలున్నాయని, ప్రస్తుతం అవి 70 నుండి 80 శాతానికి పెంచడం జరిగిందని తెలుపుతూ పన్నులు చెల్లించాల్సిన ఆవశ్యకతపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వంద శాతం సాధించి రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఆదా చేసే చర్యలపై కూడా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలలో 20 రూపాయలకు రెండు ఎల్.ఇ.డి. బల్బులను అందజేస్తుందని ఆయన తెలిపారు. మంచినీరు ఇతర అత్యవసర సేవలందించేందుకు వీలుగా 24 గంటలు విద్యుత్తు సరఫరా చేసేందుకు మూడవ విద్యుత్తు వైరును అమర్చేందుకు ఆయా శాఖల అధికారులలు కృషిచేయాలని అన్నారు. మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యక్రమంపై ప్రత్యేక దృష్ట సారించి ప్రజలకు మెరుగైన సేవలందంచేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ యం.రఘునందన్ రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అనంతరం పంచాయతీ, విద్యుత్తు, మున్సిపల్, నగర పంచాయతీ కమీషనర్లతో వౌలిక సదుపాయాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ శాఖలు విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన బకాయిలపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బకాయిలను చెల్లించాలని ఆదేశించారు.
జిల్లాలో కొత్త సబ్-స్టేషన్లకు అవసరమైన స్థలాలను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే వారాంతపు సమావేశాలకు విద్యుత్తు శాఖ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా పరిషత్ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి అరుణ, విద్యుత్తు శాఖ యస్‌ఇ, వికారాబాద్, తాండూరు మున్సిపల్ కమిషనర్లు, నగర పంచాయతీ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.