జాతీయ వార్తలు

మహిళలకు ఆలయ ప్రవేశంపై తొందరపాటు నిర్ణయం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్‌కు హిందూ జనజాగృతి సమితి హెచ్చరిక
పనాజీ, మార్చి 14: దేశంలోని అన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉందన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయంపై గోవాకు చెందిన హిందూ జనజాగృతి సమితి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. వివాదాస్పదమైన ఈ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయానికి వచ్చే ముందు మత నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్‌జెఎస్ పేర్కొంది. సుదీర్ఘంగా అనేక దఫాలు చర్చించిన తర్వాత స్వయం సేవకుల యూనిఫారంను మార్చాలని నిర్ణయం తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకులు మతపరమైన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోవడం సరికాదని హెచ్‌జెఎస్ అధికార ప్రతినిధి రమేష్ షిండే సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మత సంబంధమైన అంశాలతో పాటు ఆధ్యాతిక వ్యవహారాల్లో మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించే విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ధర్మాచార్య లేదా శంకరాచార్య నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని రమేష్ షిండే సూచించారు.