హైదరాబాద్

గోదారి నీళ్ల తరలింపుపై ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల తరలింపు పనులు చివరిదశకు చేరుకున్నాయి. మొదటి దశ కింద 87 ఎంజిడిల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాల తరలింపునకు సంబంధించి రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు పైప్‌లైన్‌ల నిర్మాణం పనులు పూర్తిచేశారు. దాదాపు రూ.3775కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులను మొత్తం మూడు ప్యాకేజీల కింద నిర్మాణం చేపట్టారు. మొదటి ప్యాకేజీలో 80ఎంఎల్ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ బొమ్మకల్ వద్ద నిర్మించారు. ముర్మూరు నుండి బొమ్మకల్ వరకు 53 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణం పనులను చేపట్టారు. రెండో ప్యాకేజీ కింద బొమ్మకల్ నుండి కొండపాక వరకు 72 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తయ్యయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన రిజర్వాయర్ (80ఎంఎల్)ను మల్లారం వద్ద నిర్మించారు. ప్యాకేజీ-3లో భాగంగా కొండపాక నుండి గన్‌పూర్ వరకు 55 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణంతో పాటు జంక్షన్ వర్క్‌లు పూర్తి చేశారు. గన్‌పూర్ వద్ద 150 ఎంఎల్ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తి కావడానికి సమయం పట్టనున్నందున అక్కడే 2.7 ఎంఎల్ రిజర్యార్‌ను నిర్మించి పనులు పూర్తిచేశారు. కరీంనగర్ ఎల్లంపల్లి బ్యారేజ్‌నుండి తెస్తున్న గోదావరి జలాలలను పనులు పూర్తయిన తరువాత నాలుగు ప్రాంతాల్లో పంపింగ్ చేస్తారు. నీటి పంపింగ్ స్టేషన్‌లలో 3మెగవాట్స్ సామర్ధ్యం కలిగిన తొమ్మిది పంప్‌లను ప్రతి పంపింగ్ స్టేషన్‌లలో జలమండలి అదికారులు అమర్చారు. వీటిలో ఆరు మోటార్లు పనిచేస్తుండగా, అదనంగా మూడు మోటార్లు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా అమర్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లా ఇస్తామని హమీ ఇవ్వడంతో జలమండలి ప్రాజెక్ట్ విభాగం అధికారులు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చాడానికి కృష్ణ ఫేజ్-3, గోదావరి జలాల తరలింపు పనులు చేపట్టింది. కృష్ణ ఫేజ్-3 పనులను పూర్తి చేసిన జలమండలి మొదటి దఫా కింద 45 ఎంజిడిల నీటిని గత ఏప్రిల్ మాసంలో నగరానికి తీసుకు వచ్చారు. కోర్టు కేసులతో పనుల్లో జాప్యం జరుగడంతో మిగతా 45 ఎంజిడిల నీటిని ఇటీవల నగరానికి తీసుకువచ్చింది. కృష్ణ ఫేజ్-3 పనులు పూర్తి కావడంతో జలమండలి ప్రాజెక్ట్ విభాగం ఉన్నాతాధికారులు గోదావరి జలాల తరలింపుపై దృష్టి సారించారు. గోదావరి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి దాదాపు 175 ఎంజిడిల నీటిని గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తారు. ఇప్పటి వరకు గోదావరి ప్రాజెక్ట్‌లో చేపట్టిన, పూర్తి అయిన పనులనుబట్టి మొదటి దశ కింద నగరానికి 87 ఎంజిడిల నీటిని నగరానికి మరో రెండు, మూడు రోజుల్లో తరలించడానికి జలమండలి అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి మిగత 88 ఎంజిడిల నీటిని నగరానికి తీసుకు రావడానికి మరికొంత కాలం పడుతుందని జలమండలి అధికారులు తెలుపుతున్నారు. మొదటి దఫాగా గోదావరి నుంచి నగరానికి తీసుకువస్తున్న 87ఎంజిల నీటిని తెస్తున్నారు. రింగ్‌మెయిన్-1లో భాగంగా ఘణపూర్, గుండ్ల పోచంపల్లి, లింగంపల్లి, ఎల్లమ్మ బండ, రింగ్‌మెయిన్ 2లో భాగంగా ఘన్‌పూర్, షామీర్‌పేట, ఉప్పర్‌పల్లి, కౌకూర్, ఢిఫెన్స్ ల్యాండ్, సైనిక్‌పురిలో నీటి సమస్యలు తీరనున్నాయి. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలోల నీటి సమస్యలుండవని అధికారులు పేర్కొంటున్నారు.