హైదరాబాద్

గు‘లాబీ’ ఆకర్ష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాసలోకి పెరిగిన వలసలు
తాజాగా టిడిపి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జంప్
అదే బాటలో
మరికొందరు ఎమ్మెల్యేలు

హైదరాబాద్, డిసెంబర్ 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తున్న ఆకర్ష్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సిద్ధించి, తెరాస అధికారం చేపట్టిన తర్వాత నగరానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు తెరాస తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే! రెండురోజుల క్రితం నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి ఆమె భర్త సైతం తెరాసలో చేరగా, ఇపుడు తాజాగా కంటోనె్మంట్ టిడిపి ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్‌రావులు నేరుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గురువారం కలిసి తెరాసలో చేరారు. వీరితో పాటు కాంగ్రెస్, టిడిపిలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు త్వరలోనే తెరాస తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తెరాసలో చేరేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడంటూ గత కొద్దిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నా, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన షాక్‌తో ఆయన స్పందించి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పినా, ఎన్నికల తర్వాత ఆయన తెరాస తీర్థం ఫుచ్చుకోవటం ఖాయమన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. ఇదివరకు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బిజెపి, తెలుగుదేశం పార్టీల్లో చేరిన మరికొందరు మాజీ కార్పొరేటర్లు త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేయదల్చిన డివిజన్ టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తే తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు,మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా కొనసాగి, ఇపుడు కొత్తగా వచ్చే పాలక మండలిలో కనీసం ఫోర్ లీడర్ పదవీని కేటాయిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెరాసలోకి పెరుగుతున్న వలసలు కోర్ సిటీలోని 100 డివిజన్లకు చెందిన నేతలే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ సారి కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న యువ నేతలు సైతం తెరాస పార్టీ నుంచే పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. పోటీ చేసి ఓడిపోయినా, అధికార పార్టీ నేతగా కొనసాగే తృప్తి అయినా దక్కుతుందనేది యువనేతల వాదన. ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఇతర పార్టీలకు చెందిన నేతల వలసలు ఈ రకంగా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత, టికెట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసే సమయానికి మరింత పెరిగే అవకాశముంది.