జాతీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 8:తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత విజ్ఞప్తి చేశారు.విభజన హామీల అమలు కోసం టీడీపీ,వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ లు పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు హామీలపై కేం ద్రం కట్టుబడి ఉండాలని కట్టుబడి ఉండాలని ఆమె స్పష్టం చేశారు.గురువారం నాడు బడ్జెట్‌పై జరిగిన చర్చలో కవిత పాల్గొని ప్రసంగించారు.ఏన్డీయే భాగస్వామ్యపక్షమైన టీడీపీ సభలో ఆందోళన చేయడం ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయాని చెప్పారు.వ్యాపారం సులభతరం చేయడంలో ప్రదర్శిస్తున్న చిత్తశుద్ది కేంద్రప్రభుత్వం రైతుల అంశంలో చూపడం లేదని విమర్శించారు.నాలుగు సంవత్సరాల కాలం లో వ్యవసాయం,రైతులకు సంబంధించి కేవలం రెండు బిల్లులు మాత్రమే అమోదించారని ఆమె గుర్తు చేశారు.
ఇప్పటికి రైతులు సంక్షేమానికి సంబంధించిన పలు బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నిర్మిస్తూన్న కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం రాష్ట్రానికి అండగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్రమోదీ మైక్రో ఇరిగేషన్ గురించి చాలా చేశామని చెబుతున్న,కాని అందుకు అవసరమైన పరికారాలపై కేంద్రం కేవలం 30 శాతం మాత్రమే సబ్సిడి ఇస్తుందని చెప్పారు.