జాతీయ వార్తలు

జూరాలకు చేరిన కర్నాటక జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: మంచినీటి ఎద్దడితో తల్లడిల్లిపోతున్న పాలమూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి కర్నాటక ప్రభుత్వం ఒక టిఎంసి నీటిని పంపి, తన ఔదార్యం చాటుకుంది. జిల్లాలో నెలకొన్న మంచి ఎద్దడి తీర్చడానికి కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు కృష్ణా జలాలు సోమవారం జూరాలకు చేరుకున్నాయి. నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేసిన ఒక టిఎంసిలో 0.5 టిఎంసి నీరు సోమవారానికి జూరాలకు చేరుకోగా, మిగిలిన అర టిఎంసి బుధవారానికి చేరుకుంటుందని జూరాల ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ్ధర్ నుంచి సమాచారం అందినట్టు మంత్రి హరీశ్‌రావు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తమ విజ్ఞప్తి మేరకు కర్నాటక ప్రభుత్వం స్పందించి నీరు విడుదల చేయడం పట్ల మంత్రి హరీశ్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.