హైదరాబాద్

ఫిర్యాదుకు వస్తే చితకబాదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు వస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు చితకబాదడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నగరశివారులో చోటుచేసుకుంది. వనస్థలిపురంకు చెందిన గోపి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ గోపి వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.
అయితే పోలీసులు గోపి ఫిర్యాదు తీసుకోకపోవడమే కాకుండా అసలు నువ్వే..పోస్టింగ్‌లు చేస్తున్నట్టున్నావు అంటూ చితకబాదారని గోపి తెలిపాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు గోపి తెలిపాడు. స్వల్పంగా గాయపడిన గోపిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్టు వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ తెలిపారు. గోపి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.