తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మే 5: రాష్ట్రంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ జడ్పీటీసీ అభ్యర్థి తిప్పన విజయసింహా రెడ్డి, మండలంలో పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మండలంలోని శ్రీనివాసనగర్, తుంగపాడ్, జప్తివీరప్పగూడెం, జాటావత్ తండా, అన్నారం, బొట్యానాయక్ తండా, గూడూరు, లక్ష్మీపురం, రుద్రారం, కొత్తగూడెం గ్రామాలలోనిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత కేసీఆర్‌దే, రూ 30 వేల కోట్లతో 4వేల మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యాదాద్రి ధర్మల్ ప్రాజెక్టును దామరచర్ల మండలంలో నిర్మించడం జరుగుతుందని, వచ్చే రెండు సంవత్సరాలలో విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్డ్రంలో అమలు కాని సంక్షేమ పధకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికలలో కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు అర్హులైన వారికి అందాలంటే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రైతుబంధు, రైతుబీమా పధకాలు అమలు కావాలన్నా, శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అందాలన్నా ప్రాదేశిక ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. దేశంలోఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలోని 30లక్షల మంది రైతులకుబీమా చేయ్యడం జరిగందని, అందులో వివిధ కారణాలతో మృతి చెందిన 10,100 మందికి ఒక్కొక్కరికి 5లక్షల చొప్పున 550 కోట్ల రూపాయలు బీమా పధకం క్రింద అందించి అదుకోవడం జరిగిందన్నారు. సంక్షేమపధకాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికిప్రజలు సిద్ధింగా ఉన్నారన్నారు. మిర్యాలగూడ జడ్పీటీసీగా పోటీ చేస్తున్న తిప్పన విజయసింహారెడ్డిని, 16 ఎంపీటీసి స్ధానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఈప్రాంత అభివృద్ధికై, టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రాదేశిక ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను గెలించి అభివృద్ధికి సహకరించాలన్నారు.
చిత్రం... ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి