తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు సర్కార్ మెరుగైన ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 5 : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలో అత్యంత మెరుగైన ప్యాకేజీని తెలంగాణ సర్కార్ అందిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ తెలిపారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ముంపునకు గురయ్యే అన్ని గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, బెన్‌ఫిట్స్ తీసుకొని యేడల వారి వివరాలు, చెక్కులను కోర్టుకు సమర్పించటం జరుగుతుందన్నారు. ఆ తర్వాత నిర్వాసితులకు చెందాల్సిన పరిహారాన్ని చట్ట ప్రకారం కోర్టు ద్వారానే పొందాల్సి ఉంటుందన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో పరిహారం అందచేసినప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పుడు తీసుకొని యేడల చట్ట ప్రకారం కంపల్సరీ అవార్డు పాస్ చేసి, కానె్సంట్ లేకపోతే కోర్టులో జమ చేయటం జరుగుతుందన్నారు. ఆర్‌అండ్‌ఆర్ అయ్యేదాక తీసుకొని వారి వివరాలను కోర్టుకు తెలియజేయటం జరుగుతుందన్నారు. అట్టి చెక్కును కోర్టు ద్వారానే పొందాల్సి ఉంటుందన్నారు. వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాల్లో పరిహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా సిద్దిపేట, గజ్వేల్, రెవెన్యూ డివిజన్ పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారాన్ని, ఇళ్ల పట్టాలను అందచేసే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఈ మేరకు గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సింగారం, ఎర్రవల్లి, సిద్దిపేట డివిజన్‌లోని తొగుట మండలం లక్ష్మాపూర్, రాంపూర్, బ్రహ్మణ బంజెరుపల్లి గ్రామాల్లో ప్రత్యేకంగా నియమించిన ఆర్డీఓలు, తహశీల్దార్ల బృందాలతో కలసి ముంపునకు గురయ్యే గ్రామ భూ నిర్వాసితులకు పరిహరాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. నిర్వాసితులు స్వచ్ఛందంగా ముందుకు పరిహారాన్ని అందుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస ప్యాకేజీ కింద అందిస్తున్న సాయం దేశంలో ఉన్న అన్ని ప్యాకేజీల కంటే బాగుందని నిర్వాసితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.