తెలంగాణ

టీశాట్ నెట్ వర్కులో చట్టాలపై అవగాహన 11 నుంచి ప్రత్యేక ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: టీ శాట్ ద్వారా చట్టాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్టు సీఈఓ ఆర్ శైలేష్‌రెడ్డి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అనేక ప్రత్యేక కార్యక్రమాలను అందించి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు తదితర విభాగాల ప్రశంసలు చూరగొన్న టీ శాట్ నెట్‌వర్కు చానళ్లు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ నెల 11వ తేదీ శనివారం ఏడు గంటలకు మన చట్టాలు ఏం చెబుతున్నాయి అనే పేరుతో భారత న్యాయశాస్త్రంలోని చట్టాలకు సంబంధించిన కార్యక్రమాలను టీ శాట్ నిపుణ చానల్ ద్వారా ప్రసారం చేస్తామని అన్నారు. మొదటి విడతలో 15 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తామని అన్నారు. వీటిలో పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, ఆర్ ఆర్ యాక్ట్, వారసత్వ చట్టం, అపార్టుమెంట్ యాక్టు వంటి ప్రధాన చట్టాలకు సంబంధించిన ప్రసారాలుంటాయని అన్నారు. అనుభవం ఉన్న న్యాయవాదులు ఈ అంశాలు అన్నీ వివరిస్తారని, నిత్యం ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై న్యాయవాదులు అందించే సలహాలు- సూచనలతో పరిష్కారం పొందవచ్చని శైలేష్‌రెడ్డి వివరించారు. ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు నిపుణ చానల్‌లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం మరుసటి రోజు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు విద్య చానల్‌లో పున: ప్రసారం చేస్తామని అన్నారు. నిత్య జీవితంలో న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే టీ శాట్ నెట్‌వర్కు చానళ్లు ప్రసారం చేసే మన చట్టాలు ఏం చెబుతున్నాయి అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయుక్తమైనదని ఆయన చెప్పారు.