తెలంగాణ

గీతం వర్శిటీలో అడ్మిషన్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: గీతం యూనివర్శిటీ హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగలూరు క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌనె్సలింగ్‌లో రెండు రోజులుగా విశేష స్పందన కనిపించిందని ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. ఈసారి గీతం యూనివర్శిటీ అందజేస్తున్న ఆకర్షణీయమైన ఫీజు రాయితీలు స్కాలర్‌షిప్‌లు ఎక్కువ మందికి ఉపయుక్తంగా మారాయని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ బ్రాంచిల పట్ల మక్కువ చూపగా , ఇతరులు మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచిలను ఎంపిక చేసుకున్నారు. చివరి రోజు శనివారం నాడు 12001 నుండి 18వేల ర్యాంకు వరకూ కౌనె్సలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.