తెలంగాణ

కనీస మద్దతు ధరలకే కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఖరీఫ్ సీజన్‌లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి ఆదేశించారు. నేషనల్ ఇన్ఫర్‌మేటిక్ సెంటర్ ఇప్పటికే సంబంధిత శాఖలతో ప్రభుత్వ మద్దతు ధర కొనుగోళ్లకు సంబంధించి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించినట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు సంబంధించి ఒక సమీకృత సాఫ్ట్‌వేర్‌ను ఆయా శాఖలతో చర్చించి రూపొందించాలన్నారు. రైతులకు సంబంధించి ఆయా కొనుగోళ్ల సమయంలో వారు పండించిన పంటలు, ఉత్పత్తుల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం చేసి కొనుగోలు సంస్థలకు అందుబాటులో ఉంచాలన్నానరు. సీజన్‌కు పంటల వారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాలు, ఇతర ఏర్పాట్లపై పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. రైతులు పంట వేయకముందే ఏ విధమైన ధర లభించే అవకాశం ఉందో తెలిపే వ్యవస్థను వ్యవసాయ విశ్వవిద్యాలయం, మార్కెటింగ్ శాఖ సహకారంతో రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సంబంధిత సంస్థలతో పూర్తి సమన్వయంతో పనిచేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.