తెలంగాణ

రైల్వేశాఖకు ‘్ఫని’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఇటీవల ఫొని తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ. 3 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ఈనెల 4, 5 తేదీల్లో వచ్చిన ఫొని తుఫాన్‌తో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో రైల్వే ఆస్తులకు నష్టాలు జరిగాయన్నారు. ఫొని తుఫాన్ ప్రభావంతో 137 రైళ్లకు అంతరాయం కల్గిందన్నారు. 120 రైళ్లు పూర్తి స్థాయిలో రద్దు చేయడంతో ప్రయాణం కోసం టికెట్లు రిజర్వు చేసుకున్న 40, 390 మందికి డబ్బులను తిరిగి ఇచ్చామన్నారు. ఫొని తుఫాన్ ప్రమాదంతో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రైల్వేకి రావాల్సి ఆదాయం దాదాపు రూ.2,93, 60, 249 కోల్పోయామన్నారు.
మరో ఐదు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో 554 ప్రయాణీకులకు రూ.3, 44, 002 తిరిగి ఇచ్చామన్నారు. రద్దయిన రైళ్ల స్థానంలో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశామన్నారు. ఫొనితో శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశా రాష్ట్రంలో రైల్వే ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.