తెలంగాణ

ఇక దూకుడు పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దూకుడును పెంచుతామని అంద రినీ కలుపుకుని బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ గత తప్పిదాల నుంచి అనేక పాఠాలను నేర్చుకుందని, టీడీపీ పొత్తు వల్ల చాలా నష్టపోయామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య గొంతులు మూగపోలేదని, బీజేపీ వెంట నడిచేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎండలు, కరవు, ఇంటర్ బోర్డు వైఫల్యాలతో విద్యార్థులు అల్లాడుతుంటే, కేసీఆర్ కుటుంబ సభ్యులతో దక్షిణాది రాష్ట్రాల తీర్థయాత్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మే 23వ తేదీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధిస్తామని, ఓటు బ్యాంకు పెరుగుతుందని, ఆరేడు సీట్లలో కాంగ్రెస్‌ను తృతీయ స్థానానికి నెట్టేసినట్లు సంకేతాలు ఉన్నాయని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీకి జాతీయస్థాయిలో సొంతంగా మెజార్టీ వస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. కేసీఆర్, చంద్రబాబుల మద్దతు అవసరం ఉండదని, తమ సహకారంతోనే కేంద్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. తెలంగాణలో రెండు పార్టీల వ్యవస్థ వస్తుందని, బహుళ పార్టీల విధానం తెరమరగవుతుందన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యాల వల్ల 27మందివిద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ సమాజం గట్టిబుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేయడంతో ప్రజలకు దగ్గరవుతామన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును చూసి జనం భయపడి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారన్నారు. కాని ఈ రోజు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ ఆంధ్రాలో చంద్రబాబు ఘోరమైన పరాజయం చూడబోతున్నారన్నారు. చంద్రబాబు కేవలం బీజేపీ మీద అనవసర కక్ష పెంచుకుని పనీపాటా లేకుండా దేశమంతా తిరుగుతున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు వస్తుంటే దేశంలో ఇతర పార్టీల నేతలు తలుపులు మూస్తున్నారన్నారు. వీరిద్దరి అవసరం లేకుండానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు.
ఉపాధ్యాయ పోస్టుల నియామకం నిలిచిపోయిందని, గ్రూప్-2 ఫలితాలు ప్రకటించలేదన్నారు. ఉస్మానియావర్శిటీతో పాటు అనేక వర్శిటీల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని,వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ బలపరచిన అభ్యర్థులకు భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.