తెలంగాణ

ఇఫ్లూ సామాజిక సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: యూనివర్శిటీ సామాజిక బాధ్యత కింద ఇంగ్లీషు- విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఖైరతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంచుకుని అక్కడ విద్యార్థులకు, బోధన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టిన తొలి విశ్వవిద్యాలయంగా ఇఫ్లూ ముందుకు రావడం అభినందనీయమని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వర్శిటీ నివేదికతో పాటు తమ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. ఖైరతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపిక చేసిన విదేశీ భాషల్లో శిక్షణ అందనించే అంశం కూడా పరిశీలనలో ఉందని వీసీ చెప్పారు. యూనివర్శిటీ సామాజిక బాధ్యత కింద ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మనీ, ఫ్రెంచి, స్పానిష్, ఇటాలియన్, అరబిక్ , జపనీస్, కొరియన్, చైనీస్, పర్షియన్ భాషల్లో ఓపెన్ ఎడ్యుకేఃన్ రీసోర్సెస్‌ను తమ యూనివర్శిటీ సిద్ధం చేసిందని ఆయన వెల్లడించారు. దీనిని త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. 30 గంటల్లో ఆయా భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకునే వీలుందని అన్నారు. దీనిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. అంతేగాక ఇంగ్లీష్ ప్రో పేరుతో ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశామని, ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.