తెలంగాణ

ఖమ్మంలో 82.92 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 10: ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండోదశ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 82.92, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 76.70 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలోని 6, కొత్తగూడెం జిల్లాలోని 8మండలాల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శుక్రవారం ఉదయం నుంచే ఓటుహక్కును వినియోగించుకునేందుకు జనం బారులు తీరారు. కాగా మొదటి దశలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రెండవ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు దమ్మపేట మండలం గండుగులపల్లిలో తన ఓటుహక్కును వినియోగించుకోగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో పాటు పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా అప్పటికి 76.70శాతం పోలింగ్ నమోదైంది. పూర్తిగా మావోయిస్టు మండలాలుగా ఉన్న కరకగూడెంలో 77, మణుగూరులో 60.52, పినపాకలో 72.23శాతం
పోలింగ్ నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలో 82.92శాతం పోలింగ్ నమోదు కాగా ఏన్కూరు మండలంలో 85.31, పెనుబల్లిలో 84.61, వేంసూరులో 80,49, తల్లాడ 86.65, కల్లూరు 77.45, సత్తుపల్లి 83.03శాతం పోలింగ్ నమోదైంది. ఇలాఉంటే దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. అది అధికారికమైనదేనని అధికారులు కూడా గుర్తించారు. దానిపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఐ స్థాయి అధికారులతో బందోబస్తు నిర్వహించిన అధికారులు మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కాగా రెండు జిల్లాల పరిధిలో పోలింగ్‌ను ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్‌బాబు పరిశీలించారు.