తెలంగాణ

‘లక్ష్మీ’ కటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 8: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జడ్పీ పీఠాలను తెరాస కైవసం చేసుకోగా కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాల్లోనూ తొలిసారిగా మహిళా అభ్యర్థులే జడ్పీ చైర్‌పర్సన్‌లుగా కొలువుదీరారు. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏకగ్రీవంగా జడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మెన్ పదవి కోసం ఆద్యంతం నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో చివరకు మూడు ఓట్ల తేడాతో విజయం తెరాసకు వరించింది. కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థి చారులత రాథోడ్ చివరి క్షణంలో కమలం శిబిరాన్ని వీడి తెరాస అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌కు చెందిన నార్నూర్ జడ్పీటీసీ జనార్ధన్ రాథోడ్ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నెల రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటించగా 15 జడ్పీటీసీలకు 14 మంది జడ్పీటీసీలు టీఆర్‌ఎస్ నుండి గెలుపొందడంతో కోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జడ్పీ వైస్ చైర్మెన్‌గా అదే పార్టీకి చెందిన సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు ఎన్నిక కావడం గమనార్హం. అదే విధంగా మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌గా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి కోటపల్లి నుండి జడ్పీటీసీగా ఎన్నికై జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవమయ్యారు. ఈ జిల్లాలో మొత్తం 16 జడ్పీటీసీలకు గాను 12 టీఆర్‌ఎస్, ముగ్గురు కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఎన్నిక కాగా జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరు కావడంతో ఎస్సీ మహిళా కోటా నుండి భాగ్యలక్ష్మి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అదే విధంగా నిర్మల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా జనరల్ మహిళ కోటా నుండి మాజీ డిసిసిబి చైర్మెన్ రాంకిషన్ రెడ్డి సతీమణి కోరుపల్లి విజయలక్ష్మి ఏకగ్రీవమయ్యారు. వైస్ చైర్మెన్‌గా తానూర్ జడ్పీటీసీ బాసెట్టి సాగరబాయి ఎన్నిక కావడం గమనార్హం. ఇక్కడ ఇద్దరు మహిళలు జడ్పీలో ప్రాతినిథ్యం వహించడం విశేషం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా వస్తున్న ఎన్నికల ఫలితాలు ప్రాదేశిక ఎన్నికల్లో కూడా అదే హవా కొనసాగడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఆరుకు ఆరు జడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా ఎస్సీ జనరల్ స్ధానం నుండి చైర్మన్‌గా డాక్టర్. మారపల్లి సుధీర్‌కుమార్, వైస్ చైర్మన్‌గా గజ్జేల్లీ శ్రీరాములు ఎన్నికైయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్మన్ జనరల్ మహిళ రిజర్వేషన్ కావడంతో చైర్మన్‌గా గండ్ర జ్యోతివెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్ ఎన్నికైయ్యారు. జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ జనరల్ రిజర్వుడ్ కాగా చైర్మన్‌గా పాకాల సంపత్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరిబోయిన బాగ్యలక్ష్మి ఎన్నికైయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ స్ధానం ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, వైస్ చైర్‌పర్సన్‌గా కల్లెపు శోభ ఎన్నికయ్యారు. ములుగు జిల్లా పీఠం జనరల్ స్ధానం అయినప్పటికి బీసీకి దక్కింది. కుసుమ జగదీశ్ జెడ్పీ చైర్మన్‌గా, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ఎన్నికైయ్యారు. మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్‌గా ఎస్టీ జనరల్ రిజర్వుడ్ కాగా అంగోతు బిందు చైర్ పర్సన్‌గా, నూకల వెంకటేశ్వర్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.