తెలంగాణ

అన్నీ ‘కారు’ ఖాతాలోకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ గులాబీ విరబూసింది. రాష్ట్రంలోని మండల పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లోనూ పునరావృతం అయంది. కారుజోరుకు తిరుగులేకుండా పోయంది. టాప్‌స్పీడ్‌లో దూసుకుపోయన కారును అడ్డుకునే పార్టీయే లేకుండా పోయంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. శనివారం జడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎదురే లేదు. ఎంపీపీ ఎన్నికల్లలోనూ అధికార పార్టీ ఏకపక్షంగా ఫలితాలు సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కొద్దోగొప్పో పోటీ చేసిన విపక్షాలు ఇప్పడు చతికిలపడ్డాయ.
*
సంగారెడ్డి, జూన్ 8: స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్లుగా ముగ్గురు మహిళలు అధ్యక్ష పీఠాలను అధిరోహించారు. మూడు జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం చాటుకుంది. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పుల్కల్ జడ్పీటీసీగా గెలుపొందిన పట్లోళ్ల మంజుశ్రీ, వైస్ చైర్మన్‌గా జిన్నారం జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్‌గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్‌గా చిన్నకోడూర్ జడ్పీటీసీ సభ్యురాలు వేలేటి రోజాశర్మ, ఉపాధ్యక్షుడిగా హుస్నాబాద్ జడ్పీటీసీ సభ్యుడు రాజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెదక్ జడ్పీ చైర్‌పర్సన్‌గా మనోహరాబాద్ జడ్పీటీసీగా ఎన్నికైన హేమలత, ఉపాధ్యక్షురాలిగా మెదక్ జడ్పీటీసీ లావణ్యారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడు జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
నల్గొండలో మూడు జడ్పీల్లో..
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జడ్పీ చైర్మన్ పదవులు టీఆర్‌ఎస్ పార్టీకే దక్కాయి. మూడు జిల్లాల్లో చైర్మన్ పదవుల సాధనలో అవసరమైన మెజార్టీ జడ్పీటీసీ సభ్యుల బలం టీఆర్‌ఎస్‌కు ఉండటంతో శనివారం నిర్వహించిన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియలో టీఆర్‌ఎస్ చైర్మన్‌ల ఎన్నిక లాంఛనప్రాయంగా సాగింది. ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి చేశాక మధ్యాహ్నం జడ్పీ చైర్మన్‌ల ఎన్నికలను కలెక్టర్లు నిర్వహించారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా నార్కట్‌పల్లి జడ్పీటీసీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కే చెందిన ఇరుగు పెద్దయ్య ఎన్నికయ్యారు. మొత్తం 31మంది జడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్‌కు 24మంది సభ్యులుండటంతో వారి మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక పూర్తయ్యింది.
సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ తుంగతుర్తి జడ్పీటీసీ గుజ్జ దీపిక, వైస్ చైర్మన్‌గా ఆత్మకూర్(ఎస్) గోపగాని వెంకటనారాయణగౌడ్ ఎన్నికయ్యారు. ఈ జిల్లాలో మొత్తం 23మంది జడ్పీటీసీలకు 20మంది జడ్పీటీసీలున్న టీఆర్‌ఎస్ సునాయసంగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను సాధించింది. మంత్రి జి.జగదీష్‌రెడ్డి జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు హాజరై వారికి అభినందనలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తనయుడు, బొమ్మలరామారం టీఆర్‌ఎస్ జడ్పీటీసీ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ధనావత్ బిక్కు నాయక్ ఎన్నికయ్యారు. మొత్తం 17మంది జడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్‌కు 12మంది జడ్పీటీసీల బలముండటంతో టీఆర్‌ఎస్‌కే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయి.
పాలమూరులో ..
మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు జడ్పీపీఠాలపై గులాబీ జెండా ఎగురవేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీలు జడ్పీ చైర్లన్లు, వైస్‌చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా భూత్పూర్ జడ్పీటీసీగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, జడ్చర్ల జడ్పీటీసీగా గెలుపొందిన యాదయ్య వైస్‌చైర్మన్‌గా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా వనపర్తి జడ్పీటీసీగా గెలుపొందిన లోక్‌నాథ్‌రెడ్డి వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొత్తకోట జడ్పీటీసీగా గెలుపొందిన వామన్‌గౌడ్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా తెల్కపల్లి జడ్పీటీసీగా గెలుపొందిన పద్మావతి జడ్పీచైర్మన్‌గా కాగా వైస్ చైర్మన్‌గా చారకొండ జడ్పీటీసీగా గెలుపొందిన బాలాజీసింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా మానవపాడు జడ్పీటీసీగా గెలుపొందిన సరితను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వైస్‌చైర్మన్‌గా సరోజనమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నారాయణపేట జిల్లా పరిషత్ ఎన్నికల్లో మక్తల్ జడ్పీటీసీగా గెలుపొందిన వనజ జడ్పీచైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా మరికల్ జడ్పీటీసీగా గెలుపొందిన సురేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జడ్పీ చైర్మన్‌లు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు మొత్తం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో..
కరీంనగర్: ప్రాదేశిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయ ఢంకా మోగించిన అధికార పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లా జడ్పీలపై గులాబీ జెండాను ఎగరవేశాయి. శనివారం జరిగిన జడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నికల్లోనూ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షుల ఎంపికలో కారుదే హవా కొనసాగింది. అనధికారికంగా ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లుగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తతతో వ్యవహరించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కనమల్ల విజయ, వైస్ చైర్మన్‌గా పేరాల గోపాల్‌రావు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా పుట్ట మధు, వైస్ చైర్మన్‌గా మండిగ రేణుక, జగిత్యాల జడ్పీ చైర్మన్‌గా దావ వసంత, వైస్ చైర్మన్‌గా పొద్దినేని హరిచరణ్‌రావు, సిరిసిల్ల జడ్పీ చైర్మన్‌గా న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్‌గా సిద్దం వేణు ఎన్నికయ్యారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుబీ మోగించి ఆ తరువాత పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తాచాటిన గులాబీ పార్టీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చేదు అనుభవం ఎదురైంది.
ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ పార్టీకి కంచుకోట సెంటిమెంట్ ఉన్న గులాబీకి దీటుగా కరీంనగర్‌లో కమలం వికసించింది. కేసీఆర్ తనయ కవిత కూడా ఓటమి పాలు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరాశకనిపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 58 జడ్పీటీసీ స్థానాలకు 54 దక్కించుకొని, 653 ఎంపీటీసీల్లో 402 స్థానాలు చేజిక్కించుకుని మరో సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాసకు కలిసొచ్చిన సెంటిమెంట్ కరీంనగర్ కంచుకోటలో మరోసారి గులాబీ రెపరెపలాడింది. నాలుగు జడ్పీ పీఠాలను సైతం కైవసం చేసుకొని కారు హవా కొనసాగించి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
నిజామాబాద్‌లో ..
నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మెన్లు, వైస్ చైర్మెన్‌లు, కోఆప్షన్ మెంబర్ల పదవులను అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సునాయాసంగా చేజిక్కించుకోగలిగింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ చెర్మన్‌గా మాక్లూర్ జడ్పీటీసీ దాదన్నగారి విఠల్‌రావు, వైస్ చైర్మెన్‌గా ఎడపల్లి జడ్పీటీసీ మాణిక్యాల రజితాయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి బాటలోనే కోఆప్షన్ సభ్యులుగా భీమ్‌గల్ మండలం బాబాపూర్‌కు చెందిన మహ్మద్‌అబ్దుల్ మోయిజ్, కోటగిరి మండలం కల్లూర్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెరాస ఆవిర్భావం నుండి ఆ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న విఠల్‌రావు విధేయతను గుర్తించిన తెరాస అధిష్టానం జడ్పీ చైర్మెన్‌గా ఆయనకు అవకాశం కల్పించింది. మొత్తం 27జడ్పీటీసీ స్థానాలకు గాను తెరాస తరఫున 23మంది గెలుపొందడంతో చెర్మన్ సహా అన్ని పదవులను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకోగలిగింది. కాగా, నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళా కేటగిరికి రిజర్వ్ కాగా, నిజాంసాగర్ జడ్పీటీసీ దఫేదార్ శోభ మొట్టమొదటి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పాటు కావడానికి ముందు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మెన్‌గా ఆమె భర్త దఫేదార్ రాజు కొనసాగారు. ప్రస్తుతం కొత్త జిల్లాలో ఆయన సతీమణి దఫేదార్ శోభకు చైర్‌పర్సన్‌గా తెరాస అధిష్టానం అవకాశం కల్పించింది. అదేవిధంగా జడ్పీ వైస్‌చైర్మన్‌గా బీబీపేట జడ్పీటీసీ పీ.ప్రేమ్‌కుమార్ ఎన్నికయ్యారు. కోఆప్షన్ సభ్యులుగా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్‌కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్, నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవుపల్లికి చెందిన అబ్దుల్ మాజిద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 22 జడ్పీటీసీ స్థానాలకు 14మంది సభ్యుల బలం కలిగి ఉన్న తెరాస అన్ని పదవులను ఏకగ్రీవంగా కైవసం చేసుకోగలిగింది. తెరాస సభ్యులంతా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించేలా జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయం చేశారు.

చిత్రాలు.. బండ నరేందర్‌రెడ్డి
నల్లగొండ
*ఎలిమినేటి సందీప్‌రెడి
యాదాద్రి భువనగిరి
*గుజ్జ దీపిక
సూర్యాపేట
* స్వర్ణసుధాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్
*పద్మావతి
నాగర్‌కర్నూల్
*సరిత
జోగులాంబ గద్వాల
*లోక్‌నాథ్‌రెడ్డి
వనపర్తి
* వనజ
నారాయణపేట
*కనమల్ల విజయ
కరీంనగర్
*పుట్ట మధు
పెద్దపల్లి
*న్యాలకొండ అరుణ
సిరిసిల్ల
*దావ వసంత
జగిత్యాల