తెలంగాణ

పరిపాలనపై మంత్రుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర మంత్రులు ఇకనుండి పరిపాలనాపరమైన అంశాలపై దృష్టికేంద్రీకరించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏవోఒకరమైన ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి, తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మధ్యలో శాసనమండలిలో కొన్ని ఖాళీలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఇటీవలే జిల్లాపరిషత్, మండల పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు మిగిలాయి.
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం కోసం మంత్రులు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల మంత్రులు ఇప్పటి వరకు పరిపాలనాపరమైన అంశాలపై పెద్దగా శ్రద్ద తీసుకోలేదు. రివ్యూలు తదితరాలు కూడా పెద్దగా జరగలేదు. పైగా ఓట్- ఆన్- అకౌంట్ బడ్జెట్ కావడంతో ఏ శాఖకు ఎంత నిధులు విడుదల చేస్తారో ఖచ్చితంగా తెలియకపోవడంతో ఆర్థికపరమైన అంశాలపై మంత్రులు నిర్ణయాలు తీసుకోలేదు. ఇక నుండి పరిపాలనాపరమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.