తెలంగాణ

స్థానిక సంస్థలకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 5: గ్రామీణ వికాసం స్థానికసంస్థలతోనే సాధ్యమన్న భావనతో సీఎం కేసీఆర్ స్థానికసంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ తొలి పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం శుక్రవారం జిల్లాకేంద్రంలోని నూతన జడ్పీ భవనంలో అట్టహాసంగా జరిగింది. జడ్పీ తొలి చైర్‌పర్సన్‌గా గుజ్జ దీపికయుగేందర్‌రావు, వైస్ చైర్మన్‌గా గోపగాని వెంకటనారాయణలతో పాటు జడ్పీటీసీలు, కో-ఆష్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జిల్లా జడ్పీకి తొలి పాలకవర్గ సభ్యులుగా ఎన్నికకావడం అదృష్టంగా భావించాలన్నారు. ఐదేళ్లపాలనలో జిల్లా ప్రజలు ఆశించిన స్ధాయిలో పనిచేసి మంచి పాలకవర్గంగా పేరుగడించాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో స్థానికసంస్థలే కీలకపాత్ర పోషిస్తాయని ఇవి నిర్వీర్యమైతే గ్రామాల అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. గతంలో స్థానికసంస్థల పరిధి విస్తృతంగా ఉండేదని, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పాఠశాలల నిర్వహణ ఇలా అనేక అంశాలపై అజమాయిషీ ఉండేదని గుర్తుచేశారు. అయితే గత పాలకుల విధానాల వల్ల స్థానికసంస్ధలు నిర్వీర్యమైపోయాయన్నారు. ఫలితంగా గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోతుందన్నారు. అందువల్లే సీఎం కేసీఆర్ స్థానికసంస్థల పటిష్టతపై ప్రత్యేక దృష్టిసారించి కొత్త చట్టాలు రూపొందిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామీణప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాటి నుంటి ప్రజల దృష్టాంతా నేతలపైనే ఉంటుందని, గతానికి, గెలుపొందిన తర్వాత నడవడికను ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారన్నారు. అందువల్ల కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేస్తూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా రాణించడం కత్తిమీద సాములాంటిదని, అయినప్పటికీ ప్రజా సేవలో ఉండే సంతృప్తి, కలిగే అనుభూతి అనిర్వచనీయమైనదన్నారు. జడ్పీ పాలకవర్గం సమర్థవంతంగా పనిచేసి సూర్యాపేట జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లాపార్టీ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.