తెలంగాణ

వచ్చే మేడారం జాతరను సక్సెస్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, జూలై 6: వచ్చే ఏడాది జరిగే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని ములుగు కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి అన్నారు. శనివారం మేడారంలోని వాచ్‌టవర్‌పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ శాఖల వారీగా ప్రతిపాదనలు సమర్పించిన అధికారులు తప్పొప్పులు సరి చేసుకుని నిధులపై మరింత సమాచారం సేకరించాలని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే మహాజాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రకు చెందిన భక్తులు కోటికి పైచిలుకు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. 18 శాఖలకు చెందిన అధికారులు భక్తులకు సౌకర్యవంతంగా ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టి కృషితో సక్సెస్ చేయాలని సూచించారు. ఇప్పటికే రూ.1.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఈ నిధులు త్వరలోనే విడుదల కానున్నాయని తెలిపారు. త్వరలో మంత్రులు మేడారాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించనున్నారని తెలిపారు. అనంతరం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సమావేశంలో ఐటీడీ ఏపీవో చక్రధర్‌రావు, ములుగు ఓఎస్‌డీ సురేష్‌కుమార్, తహసీల్దార్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
చిత్రం... అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి