తెలంగాణ

కొత్త మోటార్ వాహన చట్టంపై సర్వత్రా వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం పెరిగిన జరిమానాలు త్వరలో అమలు కానున్నాయి. వాహనదారులపై భారం పడనున్నది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాదారులు భారీ జరిమానాలు కట్టక తప్పదు. ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుంను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టం, సవరణ చట్టానికి రాష్టప్రతి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. ఆ చట్టం ప్రకారం నిబంధనలు జఠిలంగా మారాయి. వాటిని దశల వారీగా అమలు చేయాలని కేంద్ర రావాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రావాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశల వారీగా అమలులోకి రానున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన వాహనాదారులకు రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్థానికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న సిగ్నల్స్ సరిగ్గా పని చేయకపోవడం, అందుకు తోడుగా రోడ్లపై లైన్ మార్కింగ్‌లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు అనునిత్యం వాహనాదారులను వెంటాడుతున్నాయి. రోడ్డు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టం తీసుకువచ్చిందని పోలీసులు తెలుపుతున్నారు. వాహనదారులు జరిమానాలు చూసైనా నిబంధనలు తప్పక పాటిస్తారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి డబ్బును ఆదా చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, వాహన కాగితాలు కలిగి ఉండాలని చెబుతున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పనిచేయకపోడం అందుకు తోడుగా పనిచేస్తున్న సిగ్నల్స్‌లో లైట్లు చెడిపోయి ఒకటి ఉండి, మరొకటి వెలగక పోవడం వంటి సమస్యలు అనేకం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వాహన చట్టంను అమలు చేసేదీ.. లేనిదీ ప్రభుత్వం తేల్చాల్సి ఉందని పలువురు పోలీసు ఉన్నాతాధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చాలాన్‌లపై ఉంచిన శ్రద్ధ రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ను నియంత్రించడంలో చూపకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఏమైన్నప్పటికీ ఇకపై వాహనాదారుడు రోడ్డుపైకి వచ్చాడంటే ఇక నుంచి జాగ్రత్త పడాల్సిందే. హైదరాబాద్ నగరంలో రోడ్లు గుంతలమయం, సిగ్నల్స్ వద్ద చెడిపోయిన రోడ్లతో పాటు గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ చెడిపోయినా ఇంత వరకు వాటిని బాగు చేయలేదని నగర ప్రజలు వాపోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని చెబుతున్న ట్రాఫిక్ పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెడిపోయిన సిగ్నల్స్‌ని బాగుచేయడంలో ఎందుకు శ్రద్ధ చూపకపోవడం శోచనీయం.