తెలంగాణ

బడ్జెట్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 2019-20 వార్షిక బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. ప్రగతిభవన్‌లో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సోమవారం శాసనసభ, శాసనమండలి ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించింది. అనంతరం బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం పూర్తిస్థాయి మంత్రిమండలి సమావేశం
కావడం ఇదే తొలిసారి. మంత్రివర్గ విస్తరణ జరగడానికి ముందు వరకు ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కేసీఆరే నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణలో ఆర్థికశాఖను మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అప్పగించారు. అయితే బడ్జెట్ రూపకల్పనపై జరిగిన కసరత్తులో సీఎం కేసీఆరే మొదటి నుంచి పాలుపంచుకోవడంతో శాసనసభలో బడ్జెట్‌ను ఆయనే ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి హోదాలో హరీశ్‌రావు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇలా ఉండగా శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా మంత్రిమండలిలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశా నిర్దేశం చేశారు.