తెలంగాణ

సర్కార్ అవినీతిపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనంలోకి వెళ్లాలని, అవినీతి పనులను ఎండగట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన మహబూబ్‌నగర్ నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 11వ తేదీన అసెంబ్లీ కేంద్రాల్లో 11వ తేదీన 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తారు. ఆదివారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. సభ్యులకు బీమా కల్పించే విషయమై విధి విధానాల ఖరారు,
బాధ్యతను భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర రెడ్డికి అప్పగించామన్నారు. అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామన్నారు. గాంధీ సిద్ధాంతాలను వాడవాడల ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. పది మంది శిక్షకులు ఎఐసీసీ నుంచి రాష్ట్రానికి వస్తారన్నారు. తెలంగాణ చరిత్ర తెలియని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17వ తేదీన బీజేపీ తెలంగాణ విమోచన కార్యక్రమాలను చేపట్టాలని ప్రచారం చేసుకుంటుందన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో బీజేపీకి ఎలాంట సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లనే 1948లో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు చరిత్ర తెలియదన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్ బృందాలను పంపుతామన్నారు. యూరియా కొరతతో రైతాంగం విలవిలలాడుతోందన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడి రైతులు చనిపోతుంటే, చులకనగా మాట్లాడుతున్నరన్నారు. యూరియా కొరత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యం వల్లనే తలెత్తిందన్నారు. ఖరీఫ్, రబీలకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారని, కాని 50 శాతం రైతులకు ఇంకా రాలేదన్నారు. రైతు రుణమాఫీని కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
యురేనియం మైనింగ్ విషయంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యాదాధ్రిలో కేసీఆర్ చిత్రాలను చెక్కడం అహంకారానికి పరాకాష్ట అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల అంచనాల పెంపుదలను పరిశీలించేందుకు, అవినీతిపై ఒక కమిటీని వేస్తామన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కన్వీనర్‌గా భట్టి విక్రమార్కను నియమించారు. ఈ కమిటీ రెండు నెలల్లో అధ్యయనం చే గవర్నర్‌కు నివేదిక ఇస్తారు. అవినీతిని సహించమంటున్న కేంద్రానికి కూడా నివేదిక ఇస్తామన్నారు.
సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను 23 రోజుల పాటు నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజా ఆరోగ్యం, రుణమాఫీ,గిట్టుబాటు ధర, యూరియా కొరతపై చర్చిస్తామన్నారు. నిరుద్యోగ సమస్యమీద కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై ప్రశ్నిస్తామన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇల్లు అని చెప్పి, ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కూడా లేకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతి, సీతారామ ప్రాజెక్టులో టెండర్లలో జరిగిన అవినీతిపై సభలో లెక్కలతో సహా అడుగుతామన్నారు. డీపీఆర్‌లు ఇవ్వాలని గతంలో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్‌ను 57 సంవత్సరాలకే ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి