తెలంగాణ

సాగర్‌కు మళ్లీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 8: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న వరద ఉద్ధృతి నేపధ్యంలో నాగార్జున సాగర్‌కు సైతం ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. ఆదివారం శ్రీశైలం నుండి సాగర్‌కు 86,792 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తుండగా, సాగర్ జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు, 312 టీఎంసీలకుగాను 587.10 అడుగులకు, 308.56 టీఎంసీలకు చేరింది.
సాగర్ ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా 9767 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 6712 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 33,048 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 2400 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా మొత్తం అవుట్ ఫ్లో 52300 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అటు పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. పులిచింతలకు ఇన్‌ప్లో 30 వేల క్యూసెక్కులుగా ఉండగా, అటవుట్ ఫ్లో 36,655 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు, 882 అడుగులకు గాను 882.40 అడుగులు, 201.12 టీఎంసీలుగా కొనసాగుతుండగా, ఇన్‌ఫ్లో 2 లక్షల 55 వేల క్యూసెక్కులు ఉండటంతో దిగువ నాగార్జున సాగర్‌కు మరింత నీటిని విడుదల చేసే అవకాశముంది. ఇదే రీతిలో వరద ఉద్ధృతి కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.