తెలంగాణ

కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్టు గేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/కేతెపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ పిదప రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న కేతెపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు ఆరవ నెంబర్ రెగ్యులెటరీ గేటు విరిగి కొట్టుకపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతుంది. ఇటీవలి వర్షాలు, వరదలతో మూసీ నదికి పెరిగిన వరద ఉదృతితో మూసీ ప్రాజెక్టు నిండుకుండగా మారింది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 645అడుగులకుగాను 644.90అడుగులు, 4.46 టీఎంసీలకు గాను 4.42టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదే రోజు రాత్రి 6:30ప్రాంతంలో తుప్పు పట్టి ఉన్న ఆరవ నెంబర్ రెగ్యులెటరీ గేటు ప్రాజెక్టులో నీటి అలల ఒత్తిడికి తాళలేక కొట్టుపోయింది. దీంతో ప్రాజెక్టులో నీరంతా వృధాగా దిగువకు మూసీ నదిలోకి వెలుతుంది. ఈ నీరంతా వాడపల్లి వద్ధ కృష్ణానదిలోకి కలువనుంది. అటు నుండి పులిచింతల ప్రాజెక్టులోకి, సముద్రంలోకి వెళ్లనుంది. ప్రాజెక్టు కొట్టుకపోయిన గేటు నుండి మూసీ నదిలో వరద ఉదృతి పెరుగడంతో దిగువ ప్రాంతాల ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. గత పదేళ్లలో 2013, 2016, 2017లలో పిదప మళ్లీ 2019సెప్టెంబర్ మాసంలో పూర్తిగా నిండింది. ప్రాజెక్టు కుడి, ఎడమకాలువలకు గత వారం రోజులుగా రోజుకు సగటున 350క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు ఖరీఫ్ పంటలకు సాగునీరందిస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉన్నందునా ఈ ఏడాది యాసంగి పంటకు కూడా కుడి, ఎడమకాలువల కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని కేతెపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడ, సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహడ్ మండలాలకు చెందిన 42గ్రామాల కింద 33వేల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలకు నిర్ణయించారు. ఇంతలోనే ప్రాజెక్టు గేటు కొట్టుకపోవడంతో యాసంగి పంటల సాగుపై ఆశలు పెట్టుకున్న మూసీ ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరైపోయినట్లయ్యింది. గేటు కొట్టుకపోవడంతో తెల్లవారే సరికి ప్రాజెక్టు నీటి మట్టం 644.90నుండి 612అడుగులకు పడిపోయి 4.42టీఎంసీల నీళ్లు వృధాగా దిగువకు వెళ్లనున్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 618అడుగులు.
మరమ్మతుల్లో..ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం
మూసీ ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా కాలువలు, మైనర్ల, డిస్ట్రిబ్యూటరీల షట్టర్ల ఆధునీకరణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం 10కోట్లు మంజూరు చేసినప్పటికి 2019-20బడ్జెట్‌లో 4.17కోట్లు కేటాయించింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం 2016లో 20కోట్లతో మూసీ ప్రాజెక్టు గేట్ల ఆధునీకరణ పనులు జరిపించింది. ఐనప్పటికి ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోవడం పనుల్లో నాణ్యతను, అధికారుల పనితీరును ప్రశ్నార్ధకం చేసింది. 1964లో నిర్మించిన మూసీ ప్రాజెక్టు రెగ్యులేటరీ గేట్లు 1991లో మొదటి సారిగా కొట్టుకపోగా, తిరిగి 29సంవత్సరాల అనంతరం మళ్లీ శనివారం గేట్లు కొట్టుకపోవడం గమనార్హం. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉన్న సమయంలో నీటి నిల్వ నిర్వాహణ, గేట్ల నిర్వాహణ అంశాలలో అధికారులు నిర్లక్ష్యం వహించినందునే ఈ దుర్ఘటనకు దారితీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈనెల 1నుండి 4వ తేది వరకు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయగా, 5వ తేది ఉదయం గేట్లు పూర్తిగా మూసీవేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి స్థాయి నీటి మట్టం 645అడుగులుకాగా అధికారులు 644.5 అడుగుల గరిష్ట నీటి మట్టాన్ని నిర్వహిస్తు నీటి విడుదలకు అవకాశం ఉన్నప్పటికి 644.90వరకు కూడా నిల్వ చేసి గేట్లు ఎత్తకపోవడంతో గేట్లపై ఒత్తిడి పెరిగి గేటు కొట్టుకపోయినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులైన అధికారులపైన, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జగదీష్‌రెడ్డి
మూసీ ప్రాజెక్టు గేటు కొట్టుకపోయిన సమాచారం అందుకున్న జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ వెంటనే రాత్రికి రాత్రి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకపోయిన గేటును, వృధాగా దిగువకు వెలుతున్న నీటిని పరిశీలించారు. కొట్టుకపోయిన గేటు నుండి నదిలో వరద ఉదృతి పెరిగినందునా లోతట్టు గ్రామాల ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గేటు కొట్టుకపోయిన ఘటనపై విచారణ జరిపిస్తామని, వెంటనే మరమ్మతులు జరిపించి ప్రాజెక్టును మళ్లీ నింపే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ప్రాజెక్టు గేట్లను సందర్శించిన సీఈ నరసింహ, ఎస్‌ఈ హమీద్‌ఖాన్‌లు మాట్లాడుతు కొట్టుకపోయిన గేటు నుండి వెలుతున్న నీటి కంటే ఇన్‌ఫ్లో అధికంగా వస్తుందని మూడు నాలుగు రోజుల్లో మరమ్మతులు జరిపించి ప్రాజెక్టులో నీటి నిల్వకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*చిత్రాలు.. శనివారం సాయంత్రం నిండుకుండలా కనిపించిన మూసీ ప్రాజెక్టు
*మూసీ ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన గేటును పరిశీలిస్తున్న మంత్రి జి.జగదీష్‌రెడ్డి