తెలంగాణ

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ఆర్టీసీ కార్మికులతో తక్షణమే మాట్లాడి వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలించి ఆమోదించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం , టీఆర్‌ఎస్ నేతలు కోటీశ్వరులయ్యారని, ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను బెదిరించడం తగదని, తప్పుడు పద్ధతులకు పాల్పడరాదని ఆయన కేసీఆర్‌కు హితవు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఒక మాదిరిగా, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నారన్నారు. ఎస్మా పెట్టి ఉద్యోగాలు తీసేస్తామంటే ప్రజలు మీ ఉద్యోగం తీసేస్తారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి సంఘీభావం తెలియచేస్తున్నట్లు చెప్పరు. కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అంటూ బెదిరించడం సరైంది కాదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిందే ఆర్టీసీ కార్మికులన్నారు. పండగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకటి రెండు రోజులు చేయవచ్చని, కాని వాళ్లకు శాశ్వత పరిష్కారం కాదన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపైన ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాసే విధంగా ముఖ్యమంత్రి పాశవికంగా పాలిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా సమ్మె చేసిన వారిని బెదిరిస్తున్నారన్నారు. ఉద్యోగులు, ప్రజలు ఆర్టీసీ కార్మకలకు అండగా నిలబడాలన్నారు. ఇది ప్రజలపై ముఖ్యమంత్రి చూపిస్తున్న అక్కసుకు నిదర్శనమన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా విధుల్లోచేరని వారిని ఉద్యోగాలు పీకేస్తామని బెదిరించడం పాశవిక, నియంత చర్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భళంగా ప్రజలు బస్‌లు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతారన్నారు. ప్రజల కష్టాలకు నష్టాలకు ముఖ్యమంత్రినే కారణమన్నారు. కార్మికులతో ప్రజాస్వామ్య బద్ధంగా చర్చలు జరిపి, వారి న్యాయపరమైన డిమాండ్లను అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమించి ప్రజలకు రవాణా సౌకర్యాలు కలిగించాలన్నారు.