తెలంగాణ

మహబూబాబాద్ జిల్లాలో డెంగ్యూ :నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 17: మహబూబాబాద్ జిల్లాలో డెంగ్యూ వ్యాధి పడగవిప్పి ప్రాణాలను కబళిస్తోంది. గార్ల మండల పరిధిలో డెంగ్యూ వ్యాధి సోకి ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. గురువారం గార్ల మేజర్ గ్రామపంచాయతీలో కార్మికుడిగా పని చేస్తున్న అంబేద్కర్ పేట నివాసి వేర్పూల లక్ష్మణ్ (62), మండల పరిధిలోని గ్యామతండాకు చెందిన భూక్య మూన్యా (60), కోట్యానాయక్ తండాకు చెందిన గుగులోతు వరణ్ (16), పినిరెడ్డిగూడెం నివాసి బానోతు బుజ్జి (41) చికిత్స పొంతుతూ ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో మృతి చెందారు. మృతులు గత నాలుగైదు రోజులుగా విషజ్వరంతో అస్వస్థతకు లోను కాగా వారి కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స చేయించినా అదుపు కాలేదు. దీంతో వారిని ఖమ్మం, మహబూబాబాద్‌లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ వ్యాధి సోకిందని నిర్థారించి చికిత్సలు చేశారు. తిరిగి పరిస్థితి విషమంగా మారటంతో లక్ష్మణ్‌ను ఖమ్మం తరలిస్తుండగా, బుజ్జి ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మూన్యా, వరుణ్‌లు మహబూబాబాద్‌లో చికిత్స అనంతరం ఇళ్ళకు చేరి మృతి చెందినట్టు వారి కుటుంబీకులు తెలిపారు. మృతులందరికీ డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయినా, మండలంలో వైద్య సిబ్బంది తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లే డెంగ్యూ, విషజ్వరాలు సోకి ప్రజలు పిట్టాల్లా మృతి చెందుతున్నారని మండల అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు.