తెలంగాణ
రెడ్‌జోన్‌లో పటిష్ట భద్రత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకుంటూ మిగిలిన ప్రాంతంలో అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి, దగ్గరగా ఉన్న వ్యక్తులను 29 మందిని గుర్తించి ఇప్పటికే 16 మందిని క్యారంటైన్‌కు తరలించగా మిగిలిన 13 మందిని సోమవారం క్వారంటైన్‌కు తరలించినట్టు తహశీల్దార్ రాంరెడ్డి తెలిపారు. రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో వీధివీధినా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుండి రెడ్‌జోన్ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ప్రధాన రహదారి మినహా అన్ని అంతర్గత రహదారులను ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి బారికేడ్లతో, స్టాపర్స్‌తో మూసివేయించారు. రెడ్‌జోన్ ప్రాంతంలోని గృహస్తులకు కావాల్సిన వస్తువులను మున్సిపల్ సిబ్బంది అందచేస్తున్నారు. మిగిలిన ప్రాంతంలో నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం 11 గంటల వరకు తెరిచి విక్రయిస్తున్నారు. స్థానిక ఎన్‌ఎస్పీ కార్యాలయం సమీపంలో జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో సరసమైన ధరలకు కూరగాయల దుకాణాలను ఏర్పాటుచేసి విక్రయించారు. స్థానిక ఎన్‌టీఆర్ నగర్, చింతబండలో కూలి పనులకు వెళ్లే వంద కుటుంబాలకు కౌన్సిలర్ అలక సరిత నిత్యావసర వస్తువులను, బియ్యం పంపిణీ చేశారు. నేరేడుచర్లలో కరోనా కేసు నమోదు కావడంతో 3,607 గృహాలు, 12,546 మందిని వైద్య బృందం ఆధ్వర్యంలో ఆరోగ్య సర్వే చేయించినట్టు, వీరిలో 2 7మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించినట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నాగయ్య తెలిపారు. నేరేడుచర్ల మండల కరోనా ఇన్‌చార్జి కుమారస్వామి వీధులను పరిశీలించారు.
*చిత్రం...నేరేడుచర్లలో రెడ్‌జోన్ ప్రాంతానికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు