జాతీయ వార్తలు

లోక్‌సభలో ‘వివేకానందుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ మంగళవారం లోక్‌సభలో వినూత్న పద్ధతిలో ప్రత్యేక హోదా డిమాండ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మంగళవారం ఆయన సభకు స్వామి వివేకానంద గెటప్‌లో వచ్చారు. స్వామి వివేకానంద మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించినా తలపాగాగా మాత్రం కషాయ వస్త్రాన్ని కాకుండా తెలుగుదేశం పార్టీకి ప్రతిరూపమైన పసుపు రంగు బట్టని ధరించారు. లోక్‌సభలో ముందు వరుసలో కూర్చున్న అధికార, ప్రతిపక్ష సభ్యులకు ఆయన స్వామి వివేకానంద మాదిరిగా గంభీరంగా నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ పక్షం నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. స్వామి వివేకానంద మాదిరిగా చేతులు జోడించి తనకు నమస్కారం చేస్తున్న శివప్రసాద్‌ను ములాయం సింగ్ యాదవ్ తన దగ్గరకు తీసుకుని చెవిలో ఏదో సలహా ఇచ్చారు. అనంతరం ఆయన కాంగ్రెస్ సభ్యుల వద్దకు కూడా వెళ్లి ఏపికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శివప్రసాద్ అంతకు ముందు పార్టీ ఏంపిలతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ దాదాపు ఇరవై నిమిషాల పాటు ప్లకార్డు పట్టుకుని ధర్నా చేశారు.