జాతీయ వార్తలు

30వేల కోట్ల ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: తెలంగాణ రాష్ట్రానికి 30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ను కోరినట్టు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావాత్ వెల్లడించారు. నిరంజన్ రెడ్డి, తేజావాత్‌తోపాటు ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రతాప్ చంద్ర, ప్రణాళికా సంఘం ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ బుధవారం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాతో సమావేశమై తెలంగాణకు సంబంధించిన అర్థికాంశాలు, విభజన చట్టంలోని అమలు చేయాల్సిన అంశాల గురించి చర్చంచారు. రాష్ట్రానికి 30వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పాణిగరియా చెప్పినట్టు నిరంజన్ రెడ్డి, తేజావత్ చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన 700 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ అంగీకరించిందని వెల్లడించారు. కేంద్రం అమలుచేసే పధకాలకు సంబంధించిన వివరాలను వెంటనే వెల్లడిస్తే రాష్ట్ర ప్రణాళికల రూపకల్పన సులభమవుతుందని సూచించామన్నారు. ఏ పధకాలను కొనసాగిస్తారు, ఏ పథకాలను రద్దు చేస్తారనేది చెప్పకపోతే బడ్జెట్ తయారీ కష్టమవుతుందని నిరంజన్ రెడ్డి, తేజావత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వందల కోట్లను వెంటనే విడుదలు చేయాలన్న తమ విజ్ఞప్తిని పాణిగరియా ఆమోదించారని ఇరువురు నేతలు తెలిపారు. గిరిజనులకు అత్యంత ముఖ్యమైన మేడారం జాతరతోపాటు కృష్ణా పుష్కరాల నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల నిర్వహణకు ఆంధ్రకు నిధులిచ్చినట్టే కృష్ణా పుష్కరాల నిర్వహణకు తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరామని నిరంజన్ రెడ్డి, తేజావత్ తెలిపారు. ఫిబ్రవరి 15న జరిగే మేడారం జాతరకు రావాల్సిందిగా పాణిగరియాను కోరగా, బడ్జెట్ నిర్మాణ ఒత్తిడి లేకపోతే వస్తానని హామీ ఇచ్చినట్టు తేజావత్ చెప్పారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా కేంద్రం పరిగణిస్తోందనేది ప్రకటించాలని నీతి ఆయోగ్‌ను కోరామన్నారు. ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న నాలుగు జిల్లాలకు నాలుగు వందల కోట్లు కేటాయించాలన్న తమ డిమాండ్‌పట్ల పాణిగరియా సానుభూతితో స్పందించారన్నారు. సిఎస్‌టి నష్టపరిహారం కింద రాష్ట్రానికి ఏడు వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ఇంతవరకు కేవలం 90 కోట్లు మాత్రమే విడుదల చేశారని నిరంజన్ రెడ్డి చెప్పారు. 13వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు కేటాయించిన 788 కోట్లు విడుదల చేయాలని పాణిగరియాను కోరినట్టు వారు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర నీటిపారుదల, ఆర్థిక సంఘం అధికారులతో విడిగా చర్చలు జరిపారు.

చిత్రం... నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియాకు మెమొంటో అందజేస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
నిరంజన్‌రెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ తదితరులు