జాతీయ వార్తలు

ఇక డిజిటల్ డిగ్రీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశవ్యాప్తంగా 2017 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు డిగ్రీలను, ఇతర ధ్రువపత్రాలను డిజిటల్ రూపంలో ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ‘2017 నాటికి అన్ని డిగ్రీలను, బోర్డు సర్ట్ఫికెట్లను డిజిటల్ రూపంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. నేషనల్ అకడమిక్ డిపాజిటరి (ఎన్‌ఎడి)పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఒక జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించారని గుర్తుచేస్తూ, అన్ని వ్యవహారాలను డిజిటల్ రూపంలో నిర్వహించాలని కోరుకుంటున్నారని జావడేకర్ అన్నారు. అందువల్ల విద్యార్థులందరికీ సర్ట్ఫికెట్లను డిజిటల్ రూపంలో అందజేయడంతో పాటు ప్రతి విద్యార్థి గతంలో తీసుకున్న సర్ట్ఫికెట్లు, అవార్డులను తగిన రీతిలో ధ్రువీకరించిన తరువాత అప్‌లోడ్ చేయడానికి అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. దీని వల్ల ప్రతి విద్యార్థి ప్రొఫైల్ ఒకే క్లిక్‌తో అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వర్చువల్ డాటాబేస్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని సమాచారం. ప్రతి విద్యార్థి సాధించిన విద్యార్హతలన్నీ ఈ డాటాబేస్‌లో డిజిటల్ రూపంలో ఉంటాయి. దీనివల్ల నకిలీ డిగ్రీలు, నకిలీ మార్కుల మెమోల బెడదను నివారించడానికి వీలవుతుంది. ఈ డాటాబేస్ వల్ల ఉద్యోగులను నియమించుకోవాలనుకునే సంస్థలకు అభ్యర్థుల అర్హతలను తెలుసుకోవడం సులభం అవుతుంది. అభ్యర్థుల వివరాల కోసం విశ్వవిద్యాలయాలను సంప్రదించే పని తప్పుతుంది. ప్రపంచంలో అన్నీ వేగంగా మారుతున్నాయని, కాని అంత వేగంగా ఆలోచనా విధానం మారకపోవడమే నేడున్న సమస్య అని జావడేకర్ అన్నారు. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి మానసికంగా సిద్ధం కావలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి విజన్ అయిన డిజిటల్ ఇండియా సాధనలో నేషనల్ అకడమిక్ డిపాజిటరి తొలి అడుగని జావడేకర్ అన్నారు.