జాతీయ వార్తలు

19న కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 9:కృష్టా నది జలాల కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్య లేక రెండు రాష్ట్రాల మధ్యనే జరపాలా అన్న విదాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అక్టోబరు 19 నాడు తీర్పు వెలువరించనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేంద్రం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలు గత సెప్టెంబరు 8 తేదీతో ముగిసాయి. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ఈ వివాదంపై తీర్పును రిజర్వ చేసి, ఆ తీర్పును మూడు వారాల తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలని, అందుకే విభజన చట్టంలోని సెక్షన్-89ని ఏర్పాటు చేశారని వాదించాయి. అయితే మహారాష్ట్ర కర్ణాటకలు మాత్రం సెక్షన్-89 పరిధి చాలా చిన్నదని, విభజన చట్టాన్ని కేవలం రెండు రాష్ట్రాల కోసం తయారు చేశారని ట్రిబ్యునల్ ముందు వాదించాయి. ఏపీ తెలంగాణలు గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరపాలని వాదించాయి. మహారాష్ట్ర, కర్ణాటకలకు గతంలో నీటి కేటాయింపులపై గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులకు విఘాతం కల్గించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మధ్య నీటి పంపకాలు చేయాలని ట్రిబ్యునల్‌కి కేంద్రం స్పష్టం చేయటం తెలిసిందే. అలాగే విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు చేపట్టినట్లే నీటిని సైతం పంపిణీ చేయాలని కేంద్రం ట్రిబ్యునల్ ముందు వాదించింది. అయితే ఈ వివాదంపై నాలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బ్రిజేశ్ కుమార్ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారో చూడాల్సివుంది.