జాతీయ వార్తలు

బాబోయ్.. కోడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 9: కోడలి వేధింపులు తట్టుకోలేక ఓ రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. రాంచీలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోగా ఆర్మీ డాక్టర్ కత్తిపోటు గాయాలతో అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కుటుంబ సభ్యులంతా మాజీ ఆర్మీ డాక్టర్ కోడలి వేధింపులతో మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మాజీ డాక్టర్ కొడుకు, కోడలి మధ్య వారి ఏడేళ్ల కూతురి కస్టడీ గురించి వివాదం కొనసాగుతోందని పోలీసులు గుర్తించారు. సుకాంతో సర్కార్ అనే ఈ వైద్యుడి కుటుంబం కోకార్ ప్రాంతంలోని తన బంధువైన డాక్టర్ చౌదరికి చెందిన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వాళ్లు నోయిడా నుంచి రాంచీకి కొద్దిరోజుల ముందే వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ చౌదరి సుకాంతోకు ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆయన ఫ్లాట్‌కు వచ్చి అపార్ట్‌మెంట్‌లో పడి ఉన్న శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న సుకాంతోను ఆసుపత్రికి తరలించారు. బాధితులు సుకాంతో కోడలి గురించి విడివిడిగా రాసిన సూసైడ్ నోట్‌లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.